వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్.

 

ఎం ఎల్ సి ఎన్నికలకు సైతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్

అదనపు కలెక్టర్ జీ. వి. శ్యాం ప్రసాద్ లాల్

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
00000

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిందని, ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల కు సైతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) వర్తిస్తుందని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నందున ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్సిపాలిటీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిపారు. డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ నెల 24న స్కూటీని, 26 వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. వచ్చే నెల డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 14 న ఓ ట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగానే ఎం ఎల్ సి ఎన్నికలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిషేధ మని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి నిర్వహించే సభలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి మడుపు మోహన్, రాజిరెడ్డి, పద్మాకర్, సిపిఐ నుంచి కే సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, టిడిపి నుంచి కల్యాడపు ఆగయ్య, టిఆర్ఎస్ నుంచి సత్తి నేని శ్రీనివాస్, బి ఎస్ పి నుంచి గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post