వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం అయినా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

 

ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు రాజకీయ పార్టీలు సహకరించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్
-000-

హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడి విడిగా ఉప ఎన్నికల నిర్వాహణ పై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారము ఎన్నికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని అన్నారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. పోలింగ్ కు 72 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగించాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అమలులో ఉంటుందని, జిల్లా మొత్తం కోడ్ అమలులో ఉండదని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధి బయట ఎన్నికల సమావేశాలు నిర్వహించుకుంటే తప్పని సరిగా అనుమతి పొందాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో సి.పి.ఐ., బి.జె.పి., సి.పి.ఐ.ఎం., కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఐ.జీ. నాగిరెడ్డి, పోలీస్ కమీషనర్ వి. సత్య నారాయణ, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, గరీమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీసిఈవో ప్రియాంక, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్.డి.వో. సి.హెచ్. రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post