వివిధ శాఖలలో పెండింగ్ కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరిత గతిన కేసుల పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు.

ప్రచురణార్ధం.

ఆగష్టు 09 ఖమ్మం

వివిధ శాఖలలో పెండింగ్ కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరిత గతిన కేసుల పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల్లో పెండింగ్ కేసులపై జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ, జిల్లా పంచాయితీ కార్యాలయం, జిల్లా పౌర సరఫరాలు, జిల్లా విద్యా శాఖ, రోడ్డు భవనాలు, గనుల శాఖకు సంబంధించిన కేసులను శాఖల వారీగా సమీక్షించారు. కేసు ఏ స్థాయిలో ఉన్నదో, వాయిదాకు ఆయా శాఖల అధికారులు వారి సిబ్బందిని పర్యవేక్షించి కేసు పూర్వపరాలను తెలియజేయాలని, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post