వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. బడిబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలలో చేర్పించాలని అన్నారు. ఇటుక బట్టి , పరిశ్రమలు ,దుకాణాలు తదితర వాటిలో పనుల్లో ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించ , పాఠశాలలకు తిరిగి తీసుకువచ్చేందుకు కార్మిక శాఖ, పొలిసు శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఒకటో తరగతిలో చేరవలసిన విద్యార్థులను అంగన్వాడీ కార్యకర్తలు గుర్తించి సమీప పాఠశాలల్లో స్వయంగా చేర్పించాలని రమేష్ సూచించారు. 5వ తరగతి, 7వ తరగతి పూర్తి చేసుకొని తర్వాతి తరగతుల్లో చేరే విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలన్నారు. బడిబయటి పిల్లలను బడుల్లో చేర్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో, పాఠశాల స్థాయిలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో బడిబాట సన్నాహక సమావేశాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఈఓ రమేష్ కుమార్, ఎస్సి సంక్షేమాధికారి విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమాధికారి జేమ్లా , యూనిసెఫ్ కో ఆర్డినేటర్ గంగాధర్, వివిధ మండలాల ఏం.పి .డి.ఓ.లు, మునిసిపల్ కమీషనర్లు, పొలిసు అధికారులు, ఏం.ఈ.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు
