వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన
తేది:8.6.2022, వనపర్తి.

వనపర్తి జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు జాప్యం లేకుండా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు
బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి, వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న కేంద్ర జల శక్తి అభియాన్ బృందం జిల్లాలో పర్యటిస్తున్నదని ఆయన తెలిపారు. కొత్తకోటలోని 20 గ్రామ పంచాయతీలలో ఫిట్టింగ్ పనులు, కెనాల్ బాండ రింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం  ఐదు నుండి పది ఎకరాలు స్థలాన్ని సేకరించడానికి తాసిల్దారుతో మాట్లాడి పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని రేవల్లి, పెద్దమందడి, కొత్తకోట తదితర ప్రాంతాలలో పరిశీలించాలన్నారు. కొత్తకోటలో ఐదెకరాల అటవీ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో నర్సరీలు ఆశించిన స్థాయిలో పురోగతిలో ఉన్నాయని, అన్ని నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్యం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ఆయన చర్చించారు.
ఈ కార్యక్రమంలో జడ్పి.సి. ఈ. ఓ. వెంకట్ రెడ్డి, డిఆర్డిఓ నరసింహులు, డిపిఓ సురేష్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏ పీ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post