వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు, అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలి – జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు, అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేయాలన్నారు.

నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని అన్నారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు.

వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీజ్ అయిన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ, గ్రౌండింగ్ పూర్తీ అయిన యూనిట్లకు యూటిలైజషన్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకర్లు లబ్దిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైనంత మేరకు ధ్రువపత్రాలను నిర్దేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంస్వానిది, పీఎంఇ జి పి మరియు ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ కి సంబందించిన అన్ని పథకాలు పూర్తీ చేయుటకు కృషి చేయాలని, పంట రుణాలు పంపిణీ, వ్యవసాయ కాలపరిమితి రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు చిన్న, సన్నకారు రైతులకు అందించడానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ బ్యాంకర్లకు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2022 -23 ను అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెన్యువల్ ఎనర్జీ మరియు ఇతర రంగాలలో ఈ పొటెన్షియల్ ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్,ఆర్ బీ.ఐ ఎంజిఎం ఎమ్ జెడ్ డి రహమాన్, నాబార్డు డి డి ఎం శివి శర్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత రెడ్డి, బి సి సంక్షేమ శాఖ అధికారి విద్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post