వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా  కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వివిధ కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బ్యాంకర్లతో డిసిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అందించే వ్యవసాయ రుణాలను సకాలం లో మంజూరు చేసి నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని , ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ల కింద నిర్దేశించిన రుణాలను వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కింద మంజూరు చేసిన రుణాలను ఇవ్వాలని అన్నారు. ఎస్సి, ఎస్టీలకు పాడి గేదెలు, కూరగాయల వ్యాపారం తదితర పథకాలపై బ్యాంకర్ల దృష్టిసారించి రుణాలు మంజూరు చేయాలన్నారు . నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని, బ్యాంకు లు ఇచ్చే సబ్సిడీల  పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు. పరిశ్రమలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా, క్లియర్ చేయాలని, ఎక్కువ మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. మహిళా అభివృద్ధికి ఎస్.హెచ్.జి గ్రూపులకు నిర్ధేశించిన పద్ధతిలో  రుణాలు మంజూరు చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా చేనేతకు ప్రసిద్ధి చెందినదని, జిల్లాలోని చేనేత కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో వేనుకబడి ఉన్నందున,  ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి చేనేత కార్మికులకు  ప్రభుత్వo అంధించే రుణాల పై అవగాహన కల్పించాలని, నిరుపేద చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలని,  అర్హులైన వారందరికీ  ముద్ర రుణాలను మంజూరు చేసి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలనీ  తెలిపారు. పీఎంస్వానిది, పీఎంఇజిబివి మరియు ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ కి సంబందించిన అన్ని పథకాలు  పూర్తీ చేయుటకు కృషి చేయాలని, పంట రుణాలు పంపిణీ, వ్యవసాయ కాలపరిమితి రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు చిన్న, సన్నకారు రైతులకు అందించడానికి కృషి చేయాలని,  అన్నారు. యూత్ ఆర్గనైజేషన్ తో మాట్లాడి, మండలాల్లో యువత ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలను  ఉపయోగించుకొని వ్యాపారాలు పెట్టుకునేలా వారికి  అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా 2022 – 23  వార్షిక  రుణ ప్రణాళికకు సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. 2022 – 23  సంవత్సరానికి    రుణ  లక్ష్యం రూ. 372805.66  కోట్లుగా నిర్దేశించారు. పంట రుణాలు 240429.81కోట్లు , వ్యవసాయ పెట్టుబడి రుణాలు 40751.92 కోట్లుగా నిర్దేశించడం జరిగిందని తెలిపారు.

సమావేశం లో ఎల్.డి.ఎం సురేష్, నాబార్డ్ ఎజిఎం శ్రీనివాస్, ఆర్.బి.ఐ పూర్ణిమ, ఎస్.బి.ఐ మధుబాబు, ప్రకాష్, యూనియన్ బ్యాంక్ ఏ జి ఎం రామ్ ప్రసాద్, ఎపిజివిబి శ్యాముల్, ఇ.డి ఎస్సి కార్పొరేషన్ రమేష్ బాబు, పశు వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ రుపెందర్ సింగ్, చేనేత జౌళి శాఖ గోవిందయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారిచే జారీ చేయడమైనది.

 

Share This Post