గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేసి రాష్ట్రంలోనే ప్రధమంగా నిలవాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేసారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీస్ ఐన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ, గ్రౌండింగ్ పూర్తీ ఐన యూనిట్లకు యూటిలైజషన్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు పంపాలన్నారు.బ్యాంకర్లు లబ్దిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైనంత మేరకు ధ్రువపత్రాలను నిర్దేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంస్వానిది, పీఎం ఇ జి పి మరియు ఎస్సి ఎస్టీ కార్పొరేషన్ కి సంబందించిన అన్ని పథకాలు డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తీ చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎల్డిఎం రవిశంకర్ ఠాగూర్ మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ టార్గెట్ 15 709.72 కోట్లైతే 17664.31 కోట్లు అంటే 112 శాతం సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా పొటెన్షియల్ 2022 -23 కి 25413.73 కోట్లు ఉన్నట్లు నాబార్డ్ అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెన్యువల్ ఎనర్జీ మరియు ఇతర రంగాలలో ఈ పొటెన్షియల్ ఉన్నట్లు తెలిల్పారు.
ఈ సమావేశంలో ఆర్బి ఐ అధికారి శివరామన్, నాబార్డ్ డి పి ఓ ప్రవీణ్, వివిధ సంక్షేమ శాఖాధికారులు, బ్యాంకు అధికారులు, జి ఎం., డి ఐ సి, తదితరులు పాల్గొన్నారు.
