జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం హనుమకొండ
పత్రిక ప్రచురణ నిమిత్తము
రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా లోని రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మైనార్టీ వెల్ఫేర్ సంస్థ లు , మరియు వివిధ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికహారము, పరిసరా ల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు అంశాలపై ఈ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రారంభించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ పరిస్థితులను చూసుకునేది హాస్టల్ వార్డెన్ లపై ఎంతగానో ఉందని, అంతేకాకుండా విద్యార్థులకు సమతుల్యమైన ఆహారాన్ని అందించాలని, ముఖ్యంగా కౌమార దశలోని ఆడపిల్లల లో రక్తహీనత ఉంటుందని నివారించడానికి ఆకు కూరలను, మరియు ఐరన్ ఉండే కాయగూరలు, పండ్లు, అందించాలని ఆ ప్రాంతంలోని వైద్య సిబ్బంది ఆయా హాస్టలను సందర్శించినప్పుడు రక్త పరీక్షలు చేయించి రక్తహీనత ఉన్నటువంటి వారికి ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను అందించాలని, హాస్టల్లో సరియైన ఖాళీ స్థలము ఉన్నట్లయితే కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని అందులో వీలైనన్ని ఆకు కూరలు పెంచేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతను నేర్పించాలని వైద్య సిబ్బంది సందర్శనలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన తరగతులను నిర్వహించేటట్లు ఆయన తెలిపారు
మైనార్టీ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి శ్రీపాల గారు హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ మనందరిపై నమ్మకంతో వారి పిల్లలని హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా పిల్లల యొక్క ఆరోగ్య పరిరక్షణ చూసే బాధ్యత వార్డెన్లపై ఉందని తెలుపుతూ ముఖ్యంగా హాస్టలలో వంట చేసేవారి పైన ప్రత్యేక దృష్టి సారించి వారు వంటలు వండేటప్పుడు సరియైన పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని అదేవిధంగా వంట చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆమె పేర్కొన్నారు.
జిల్లా సర్వ లైన్స్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ సాధారణంగా పిల్లలలో వచ్చే వ్యాధుల ను ఎలా గుర్తించాలి మరియు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ వేముల అశోక్ రెడ్డి , డిపిహెచ్ఎన్ఓ శ్రీమతి సుశీల, డిప్యూటీ డెమో ప్రసాద్ హాజరైన వారికి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మరియు సమీకృతాహారము, మరియు ఆహార పదార్థాల భద్రత అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యాకూబ్ పాషా, మైనార్టీ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపల్, శ్రీ సతీష్ గారు వారి యొక్క అనుభవాలను వివరించడం జరిగింది. కార్యక్రమంలో మాధవరెడ్డి , రమేష్ మరియు వివిధ రెసిడెన్షియల్ స్కూలు, హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లు హాజరైనారు.