విహార యాత్రకు బయలు దేరిన నాగర్ కర్నూల్ బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థినిలు

పత్రిక ప్రకటన
తేది: 1-10-2022
విహార యాత్రకు బయలు దేరిన నాగర్ కర్నూల్ బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థినిలు.
సమ్మర్ కార్నివాల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నాగర్ కర్నూలు జిల్లా బి.సి సంక్షేమ వసతి గృహ విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మొదటి స్థానంలో నిలిచిన సందర్బంగా రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రోత్సాహంతో 3 రోజుల పాటు విహార యాత్రకు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుండి బి.సి సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్, కళాశాలకు సంబంధించిన 35 మంది వసతి గృహ విద్యార్థినిలు విహార యాత్రకు బయలు దేరారు. ఈ సందర్బంగా విహార యాత్ర బస్సుకు ఆదనవు కలెక్టర్ మోతిలాల్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సహాయ బి.సి. అభివృద్ధి అధికారి శ్రిధర్ జీ, సుబ్బారెడ్డి, వనపర్తి తదితరులు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post