*వి.ఆర్.ఓ.లను వివిధ శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.*

*వి.ఆర్.ఓ.లను వివిధ శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.*

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -01:

వి.ఆర్. ఓ లను వివిధ శాఖలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కె. శశాంక ఉత్తర్వులను జారీ చేశారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ తో కలిసి వి.ఆర్. ఓ.లను డ్రా సిస్టమ్ ద్వారా వివిధ శాఖలకు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటగా పేర్లను జాబితా ప్రకారం చదివి ఒక బాక్స్ లో, శాఖ పేరు మరో బాక్స్ లో రాసిన చీటిలను మరొక బాక్స్ లో వేసి డ్రా తీసి ఉద్యోగికి శాఖను కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ ఫైనాన్స్ శాఖ ఉత్తర్వుల సంఖ్య 121 ననుసరించి గ్రామ రెవెన్యూ అధికారులను వివిధ శాఖలకు కేటాయిస్తున్నట్లు, జిల్లాలోని వివిధ శాఖలకు మొత్తం 195 వి.ఆర్. ఓ.లను కేటాయించినట్లు, అందులో 163 మహబూబాబాద్ జిల్లా వారని, 15 మంది ఖమ్మం, 17 జనగాం జిల్లా వారని, వారిని మహబూబాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాట్ మెంట్ ప్రకారం కేటాయించిన శాఖలో శాఖాధికారి ఉద్యోగిని వెంటనే చేర్చుకోవాలని ఆదేశించారు.

వి.ఆర్. ఓ.లను వ్యవసాయ శాఖ, కో ఆపరేషన్ , బి.సి. వెల్ఫేర్, ఫైనాన్స్, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇంటర్ మిడియట్, హోం శాఖ, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్ మెంట్, మైనారిటీస్ వెల్ఫేర్, మునిసిపల్, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, రెవెన్యూ శాఖ, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డెవలప్ మెంట్, సెకండరీ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ట్రైబల్ వెల్ఫేర్, ఉమెన్, చిల్డ్రన్, దిజెబ్లెడ్, సీనియర్ సిటిజన్ శాఖలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో లు కొమురయ్య, ఎల్. రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, టి.ఎన్.జి. ఓ. ప్రతినిధులు, తహసిల్డార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post