వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ZP CEO ప్రియాంక.

పత్రికా ప్రకటన
తేదీ: 01-12- 2021
కరీంనగర్

ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి
ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
00000

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగం పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్లకు తమ పోలీస్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ. శ్యామ్ ప్రసాద్ లాల్, మానకొండూర్ ఈ.ఆర్.ఓ మరియు జెడ్.పి. సి.ఇ.ఓ, ప్రియాంక, కరీంనగర్, హుజురాబాద్ ఈ.ఆర్.ఓ లు మరియు ఆర్డీవోలు ఆనంద్ కుమార్, సిహెచ్. రవీందర్ రెడ్డి, చొప్పదండి ఈ.ఆర్.ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

00000000

పత్రికా ప్రకటన తేది 1.12.2021

కరీంనగర్

ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమస్త ఓటరు నమోదు అధికారులు మరియు తహసిల్దార్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లెయిమ్స్ మరియు ఆబ్జెక్షన్స్ గడువు తేది ముగిసినందున ఓటర్ల జాబితాలను త్వరితగతిన సిద్ధం చేయాలని తెలిపారు.
ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను బి ఎల్ వో ల సహాయంతో పరిశీలించి జాబితాల సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

7-కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగనున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ జిల్లాలో (2) పోలింగ్ కేంద్రాలు (1-కరీంనగర్ మరియు 2- హుజురాబాద్ ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో, హూజురాబాదులోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు. ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఓటర్లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకుని ఉండేలా చూడాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ. శ్యామ్ ప్రసాద్ లాల్, మానకొండూర్ ఈ.ఆర్.ఓ మరియు జెడ్.పి. సి.ఇ.ఓ, ప్రియాంక, కరీంనగర్, హుజురాబాద్ ఈ.ఆర్.ఓ లు మరియు ఆర్డీవోలు ఆనంద్ కుమార్, సిహెచ్. రవీందర్ రెడ్డి, చొప్పదండి ఈ.ఆర్.ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కరీంనగర్ చే జారీ చేయడమైనది.

 

Share This Post