వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ZP CEO ప్రియాంక.

 

పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్

000000

పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్ అన్నారు.

మంగళవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్లతో గూగుల్ మీట్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తులు, ఓటర్ జాబితాలో డబుల్ ఫోటోల ప్రచురణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పైబడి పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్ జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి వెంటనే తొలగించాలని అన్నారు.

అదనపు సీఈఓ బుద్ధప్రకాష్ యం జ్యోతి మాట్లాడుతూ ఈవీఎం గోదాం ల పరిశీలన నివేదికను నిర్ణీత సమయంలోగా సీఈఓ కార్యాలయానికి సమర్పించాలని, సీసీ టీవీల పనితీరు, అగ్నిమాపక ప్రమాదాలు, తదితర వివరాలను సకాలంలో పంపించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ కరీంనగర్ శాసన సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెండింగ్ ధరఖాస్తులను పరిశీలించి ఒక వారం రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్ జాబితాలో ఒకే ఫోటో రెండు మార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదాం ల పరిశీలన నివేదికలు సకాలంలో సమర్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, డిఆర్ డి ఓ పిడి శ్రీలత , కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post