You Are Here:Home→వీధి విక్రయ దారుల కుటుంబాలకు స్వానిధి సే సమృద్ధి కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
వీధి విక్రయ దారుల కుటుంబాలకు స్వానిధి సే సమృద్ధి కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, దీన్ దయాల్ అంత్యోదయ యోజన – ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో 8432 మందికి స్వానిధి పథకం ద్వారా గతం లో రుణం మంజూరు చేయడం జరిగింది.అట్టి వీధి విక్రయ దారుల కుటుంబాలకు సంబంధిత మున్సిపాలిటీ మెప్మా రిసోర్స్ పర్సన్ల ద్వారా సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖలైన మున్సిపాలిటీ, లేబర్ డిపార్టుమెంట్, మెడికల్ అండ్ హెల్త్, వుమెన్ అండ్ చైల్డ వెల్ఫెర్, పౌర సంఫరాల శాఖ, మొదలైన శాఖలకు ఇచ్చిన యూజర్ ఐడిలు, పాసు వర్డులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అట్టి సర్వె రిపోర్టును స్వానిధి సే సమృద్ది పోర్టల్ నందు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సర్వే సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లోనే సంబంధిత శాఖలకు చేరుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు ఆయన వివరించారు. సర్వే ద్వారా నమోదు చేసిన వీధి విక్రయదారుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు
సంబంధిత శాఖల వారు మంజూరు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అందుకోసం ప్రతి శాఖను సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జీభన్ భీమా యోజన, పి.ఎం. సురక్షా భీమా యోజన, ప్రధాన మంత్రి జనధన్ యోజన, రూపే ఇన్సురెన్సు కార్డు, ప్రధాన మంత్రి శ్రాం యోగి మన్ ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్ష యోజన, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తెన తర్వాత లబ్దిదారులకు అవగాహన కలిగించి అర్హతల మేరకు పథకాలను మంజూరు చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో మెప్మా పి.డి. శ్రీపాద రామేశ్వర్,స్త్రీ,శిశు,వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి సుభద్ర, డిప్యూటీ డి.ఎం .అండ్ హెచ్.ఓ. వేణుగోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీధి విక్రయ దారుల కుటుంబాలకు స్వానిధి సే సమృద్ధి కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.