వీధి వ్యాపారుల రుణాలను 100% అందించాలి – అదనపు కలెక్టర్‌ మను చౌదరి

వీధి వ్యాపారుల రుణాలను 100% అందించాలి – అదనపు కలెక్టర్‌ మను చౌదరి

నాగర్ కర్నూలు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను 100% అందజేయాలని  అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు.

కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, మునిసిపల్‌ అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

వీధి వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేల వరకు రుణాల కోసం మొదటి విడతలో 5022 మంది నమోదు చేసుకోగా 4350 మందికి మాత్రమే మొదటి విడత పది వేల రూపాయల రుణాలను అందించడం జరిగిందని మిగిలిన 672 మందికి మొదటి విడత 10 వేల రుణాలను వెంటనే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు.

రెండో విడత 20వేల రుణాలకు అర్హులైన 2590 మంది వీధి వ్యాపార దారులు ఉండగా ఆన్లైన్ నమోదు చేసిన 514 మందిలో కేవలం 254 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని మిగిలిన 260 మందికి 20 వేల రుణాలను వెంటనే అందజేయాలని ఆదేశించారు.

రుణాలు మంజూరు చేయడంతో వీధి వ్యాపారులకు ఆర్థిక సమస్యలు అధిగమించడానికి దోహదపడుతుందన్నారు. మునిసిపాలిటీలో అర్హులైన వీధి వ్యాపారులకు ఆత్మ నిర్బర్‌ భారత్‌ పథకం కింద వెంటనే సంబంధిత బ్యాంకర్లు రుణాలను అందించాలనన్నారు.

ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ నాలుగుస మున్సిపాలిటీల కమిషనర్లు అన్వేష్, జాకీర్ అహ్మద్, మెప్మా మేనేజర్ రాజేష్, శ్వేత మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post