వీధుల్లో నిరాశ్రయురాలిగా జీవిస్తున్న మహిళలను గుర్తించి వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించిన జిల్లా సంక్షేమ అధికారి.. ఈరోజు ఉదయం విధి నిర్వహణకు వస్తున్న సందర్భంలో బాలల పరిరక్షణ విభాగంలో పనిచేస్తున్న న్యాయ సేవల అధికారికి ఒక నిరాశ్రయులైన మహిళ కనిపించగా ఆమె వెంటనే జిల్లా సంక్షేమ అధికారి ఈ లక్ష్మీరాజ్యం గారికి సమాచారం ఇచ్చినది. వెంటనే స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి సఖి కేంద్రం నిర్వాహకురాలు బోనాల రోజా గారికి సమాచారం ఇచ్చి వెంటనే సదరు మహిళలను సంరక్షణ కేంద్రానికి తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.. వెంటనే అక్కడికి చేరుకొని బాల రక్షాభవన్ వాహనంలో సదరు మహిళను ఎల్లారెడ్డిపేటలోని వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగినది. ఆమె వివరాలు తెలుసుకొని ఆమెను వారి పిల్లల చెంతకు చేర్చడం, ఒకవేళ వారికి సంబంధించిన ఎవరూ లేనట్లయితే ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రంలో తగు జాగ్రత్తలతో సంరక్షించడానికి కేంద్రం నిర్వాహకులకు సూచనలు ఇవ్వడం జరిగింది….