వీపనగండ్ల, చిన్నంబావి, పెబ్బేరు మండలాలలో పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన
తేది:06.06.2022, వనపర్తి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని అధికారులను, ప్రజలను జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
సోమవారం వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పెబ్బేరు మండలాలలో పర్యటించి, సెగ్రిగెసన్ షేడ్ లు, నర్సరీలను, పల్లె ప్రకృతి వర్ణాలను, క్రీడా ప్రాంగణాలను పరిశీలించి, మన ఊరు – మన బడి కార్యక్రమాలలో పాల్గొని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీపనగండ్లలో నర్సరీని పరిశీలించి మొక్కలను హరితహారానికి సిద్ధంగా ఉంచాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణం పరిశీలించి పనులు పూర్తి చేయాలన్నారు. సెగ్రిగెసన్ షెడ్ ను ఆయన పరిశీలించారు. చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామంలో సెగ్రిగెషన్ షెడ్ పరిశీలించి, లక్ష్మీ పల్లి గ్రామంలో తెలంగాణకు హరితహారం, పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. పెబ్బెరు మండలం అయ్యవారిపల్లి నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు.
జూన్ 18వ తేదీలోగా గ్రామాలలో ఉండే సమస్యలను గుర్తించి, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. మౌలిక వసతులు అయినా త్రాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, రహదారులు, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించాలని, ఆయా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలను, పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నర్సింహులు, ఎంపీడీవోలు, ఏఈలు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post