Press note. 26.7.2021.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో ఘనంగా జరిగాయి.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ నాగేశ్వరా చారి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, అధికారులు, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి శీను, నగేష్, రాములు, బాలరాజు, ప్రతినిధులు పాల్గొన్నారు.
….DPRO. YADADRI.