వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాలు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

 

గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

000000

వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ 126 వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ (ప్రతిమ మల్టీప్లెక్స్) రోడ్డు కూడలి వద్ద గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు లతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు.వీరనారి చాకలి ఐలమ్మ ను స్ఫూర్తి గా తీసుకొని ముందుకు సాగాలని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్,తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post