వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన -కలెక్టర్ హరీష్

స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయుక్తమని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ నెల 27 న రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్న సందర్భంగా బుధవారం నాడు అక్కడ ఏర్పాట్లను జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రం ద్వారా మూడు నెలల కాల వ్యవధి గల ఆరు రకాల కోర్సులలో వృత్తి శిక్షణ ఇవ్వనున్నామని, ఒక్కో కోర్సులో 30 మంది యువతకు ప్రవేశం ఉంటుందని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని సూచించారు.

Share This Post