వృథా తగ్గించుకోవాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి*

ప్రచురునార్ధం
వరంగల్ జిల్లా

*వృథా తగ్గించుకోవాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి*

ప్రతి ఒక్కరూ వృధా ఖర్చులు తగ్గించుకొని, పొదుపు చేసుకోని ఆర్ధికంగా బలోపేతం గా ఉండడం ఎంతో ముఖ్యమని
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు

సోమవారం రోజున కలెక్టరేట్ లో ఆర్.బి.ఐ ఆర్థిక అక్షరాస్యత
వారోత్సవాలు 2023 ను లీడ్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో 2.కి.మీ వాకె థాన్ నిర్వహించారు.

కలెక్టరెట్ నుండి ఏకాశీల పార్క్ వరకు జరిగిన ఈ వాక్ థన్ ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి
జెండా ఊపి
ప్రారంభించారు.

ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి
మాట్లాడుతూ ఆర్ బీ ఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ద్వారా, ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు వివిధ గ్రామపంచాయతీ మున్సిపల్ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

మనం బ్యాంకు ద్వారా రుణాలను నిమిషాల వ్యవధిలో పొందవచ్చునని, సైబర్ నేరగాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం బ్యాంకు ఓటీపీలు ఇతర లింకులు ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశపడ కుండా ఎవరితో చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆర్థిక మోసాలకు గురైన వారు 1930, 14448 టోల్ ఫ్రీ నెంబర్ లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో LDM రాజు,యు బి ఐ డిప్యూటీఆర్ ఎం. వజీర్ సుల్తాన్, కెనరా బ్యాంక్ ఆర్ఎం మాధవి, శ్రీనివాస్ , డిసిసిబి ఏజీఎం రాజ శేఖర్, సిబిఐ ఐఓబి ఏపీజీవీబీ ఎస్బిఐ వివిధ బ్యాంకుల మేనేజర్లు ,మరియు జిల్లా అదికారులు పాల్గొన్నారు.

Share This Post