వృద్ధాప్య (ఆసరా) పింఛన్ దరఖాస్తులకు గడువు పొడగింపు…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

వృద్ధాప్య (ఆసరా) పింఛన్ దరఖాస్తులకు గడువు పొడగింపు…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

వృద్ధాప్య పింఛన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

57 సంవత్సరాలు నిండిన అర్హులు వృద్ధాప్య పింఛన్ల మంజూరి కోసం ఈనెల 11 నుండి 30వ తేదీ లోపు
మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

గతంలో దరఖాస్తు చేసుకోలేని అర్హులైన వారు తమ దగ్గరలోని మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వృద్ధులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించి మంజూరు కి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Share This Post