వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యంగులు ఆత్మాభిమానంతో జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2000/- ఆసరా పెన్షన్ ఇస్తుంది -స్థానిక శాసన సభ్యులు- మర్రి జనార్దన్ రెడ్డి

పత్రిక ప్రకటన
తేది: 30-8-2022
నాగర్ కర్నూల్ జిల్లా.
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యంగులు ఆత్మాభిమానంతో జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2000/- ఆసరా పెన్షన్ ఇస్తుందని స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుండి 57 కు తగ్గించినది. దానికి అనుగుణంగా కొత్తగా మంజూరు అయిన ఆసర పెన్షన్ ఐ డి. కార్డులను మంగళవారం స్థానిక సాయిగార్డెన్ ఫంక్షన్ హాల్లొ స్థానిక శాసన సభ్యులు తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను 547 మందికి కొత్తగా ఆసరా పెన్షన్ మంజూరు అయినట్లు తెలిపారు. అసరా పెన్షన్ల తో పాటుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, ఒంటరి మహిళలు ఎవరి పై ఆధార పడకుండా ఆత్మగౌరవంతో బతికెందుకు రాష్ట్ర ముఖ్తమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక పేద్ద కొడుకుగా రూ. 2000 ప్రతి నెల 5 నుండి 10వ తేదీ మధ్యన లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మీ, కె.సి.ఆర్. కిట్,రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్ మొదలగు పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పేదల కష్టాలను గుర్తించి పేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ ఎం.టి. రామారావు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తర్వాత కె. చంద్రశేఖర్ రావు మాత్రమేనని పేర్కొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. పెన్షన్ రాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వార్డు మెంబర్లు ఇంటింటికి తిరిగి ఆర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ వివరాలు సేకరించి త్వరలో మంజూరు అయేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు. అనంతరం మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. లబ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్ భాస్కర్ రావు, గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు, స్థానిక తహసిల్దార్ సి. భాస్కర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మెప్మా మేనేజర్ రాజేష్, వార్డు మెంబర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post