వృద్ధులను ఆదరించాలి…. అదనపు కలెక్టర్ రాజర్షి షా వృద్ధులను నిరాదరణకు గురి చేయకుండా ఆదరించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు

వృద్ధులను ఆదరించాలి…. అదనపు కలెక్టర్ రాజర్షి షా

వృద్ధులను నిరాదరణకు గురి చేయకుండా ఆదరించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు

మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆయన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఆదరాభిమానాలతో మెలగాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వయో వృద్ధులు వినియోగించుకోవాలన్నారు. వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 14567 ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమున్న వృద్ధులు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని రెగ్యులర్గా తనిఖీ చేయాలని మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి పద్మావతి కి సూచించారు. వయో
వయోవృద్ధుల సంక్షేమ చట్టం ద్వారా కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. పోషణ సంరక్షణ విషయంలో నిరాధారణకు గురయ్యే వయోవృద్ధులు మానసికంగా కుంగిపోకుండా తగిన సహాయం పొందవచ్చన్నారు.

వయో వృద్ధులు కోవిద్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలన్నారు. వయోవృద్ధుల సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారందరూ సీనియర్ సిటిజన్ కోవ లోకి వస్తారని, వయోవృద్ధుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లలు పోషించాల్సిన స్థితిలో ఉండి పోషించ లేకపోయినా, సంరక్షించ నప్పుడు చట్టం ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. వారికి సంబంధించిన పలు చట్టాలపై ఆమె వివరించారు.
వయోవృద్ధుల కమిటీ హాల్ నిర్మించి ఇస్తే బాగుంటుందని వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు చిన్నారెడ్డి కోరారు.

Covid,- 19 రెండవ దశ దృష్ట్యా వయోవృద్ధులు వారి సంరక్షకులకు సలహాలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.

అనంతరం వయోవృద్ధులకు మెమెంటో, శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, డాక్టర్ మహేందర్ రెడ్డి, సభాపతి సుగుణ దేవి, వయోవృద్ధుల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వయో వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post