వృద్ధులు ,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి

వృద్ధులు ,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి

ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోం  లో పండ్లు పంపిణీ

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

                       000000

     వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు

     స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు, దివ్యాంగులకు శుక్రవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, సమస్యlలును  అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి  అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. వికలాంగుల అభివృద్ధికి, మ్యారేజ్ ఇన్సెంటివ్, ఆర్థిక స్వాలంబన కు చేయూతనిస్తున్నారు. దివ్యాంగుల సాధికారత కోసం వారికి విద్య ఉపాధి అవకాశాలు, ఆరోగ్య భద్రత కోసం కృషి చేస్తుందన్నారు. వయోవృద్ధుల పై  వేధింపులు జరిగినప్పుడు  హెల్ప్ లైన్ నెంబర్ 14567 కు కాల్ చేస్తే సంబంధిత అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల కోసం టోల్ ఫ్రీ నెంబర్  1800 572 8980 కి కాల్ చేస్తే సంబంధిత అధికారులు తగిన సహాయం చేస్తారని తెలిపారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారి పి శ్రీనివాసరావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జవేరియా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా సహకార అధికారి శ్రీమాల, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post