వృద్ధులు భావి తరాలకు మార్గనిర్ధేశకులు : జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

వృద్ధులు భావి తరాల వారికి మార్గనిర్ధేశకులని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. సోమవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని నన్‌షైన్‌ డే కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వృద్ధులు భావి తరాల వారికి మార్గనిర్ధేశకులని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్య నూత్రాలు పాటించాలని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలను వివరించడంతో పాటు వృద్ధులకు సంబంధించిన సమన్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, డే కేర్‌ సెంటర్‌లో ఉన్నసమన్యలను పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. వృద్ధుల నంక్షేమం కోనం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి నమావేశమై సమన్యలపై చర్చించి పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం 80 సం॥లు పైబడి తోటి వృద్ధులకు సహకరిన్తున్న 10 మందిని శాలువా, పూలమాల, మెమోంటోతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఉమాదేవి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కస్సాల
సుధాకర్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post