వెంకటాద్రి రిజర్వాయర్ పరిసరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశం – జిల్లా కలెక్టర్ మను చౌదరి.

పత్రిక ప్రకటన
తేది: 26-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా
వెంకటాద్రి రిజర్వాయర్ పరిసరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశం – జిల్లా కలెక్టర్ మను చౌదరి.
వెంకటాద్రి రిజర్వాయర్ ప్రాంతం చుట్టుపక్కల ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, కొండ ప్రాంతం కలిగి ఉన్నందున పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అన్నారు. గురువారం ఉదయం వెంకటాద్రి రిజర్వాయర్ ముంపు గ్రామాల పునరావాస కేంద్రం స్థలంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పునరావాస కేంద్రంలో నిర్మించనున్న 500 ఇళ్ల లే అవుట్, మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రానికి అవసరమైన అన్ని సదుపాయాలు, రోడ్డు, పాఠశాల భవనాలు, దేవాలయాలు, పార్కులు తదితర ఇతర సౌకర్యాలతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తగినంత ఖాళీ స్థలం ఉండాలని అధికారులను సూచించారు. అనంతరం రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశం,చుట్టూ ప్రక్కల ఉన్న దేవాలయం, అందమైన కొండలను పరిశీలించిన కలెక్టర్ ఇక్కడ పర్యాటక ప్రాంతముగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పర్యాటక శాఖకు పంపుదామని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట పాల్గొన్న అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి రిజర్వాయర్ నిర్మాణము, చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక దేవాలయ ప్రదేశము, పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు, పర్యాటక కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను కలెక్టరుకు వివరించారు.
ఆర్డీఓ నాగలక్ష్మి, ఇరిగేషన్ ఇంజనీర్లు పార్థసారథి ఇతర ఇంజనీర్లు, సర్పంచు కలెక్టర్ వెంట ఉన్నారు.
———————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post