వెంకటేష్ ఉపరితల బొగ్గు ఘని ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్. అనుదీప్ తెలిపారు.

గురువారం కలెక్టర్ చాంబర్లో రెవిన్యూ, సింగరేణి, మున్సిపల్ అధికారులతో భూ సేకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 10వ తేదీనాటికి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, నివేదికలు ఇవ్వాలని చుంచుపల్లి తహసిల్దార్కు సూచించారు. ఉపరితల ఘని ఏర్పాటులో నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ద్వారా సర్వే నిర్వహించి పరిహారపు వివరాలు సిద్ధం చేయాలని చెప్పారు. రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ, రెవిన్యూ, అటవీ భూములు యొక్క హద్దులు మార్కింగ్ చేయాలని తహసిల్దారున్ను ఆదేశించారు. ఉపరితల ఘని ఏర్పాటు వల్ల నిర్వాసితులవుతున్న ప్రజలతో సమావేశం నిర్వహించాలని సింగరేణి, రెవిన్యూ అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న సింగరేణి భూములు అన్యాక్రాంతం కాకుండా మొక్కలు నాటడానికి, అదేవిధంగా పార్కులు ఏర్పాటుకు అవసరమైన భూమిని మున్సిపాల్టీకి అప్పగించాలని కోరారు. కూలీలైన్ శిథిలావసద్ధలో ఉన్న మంచినీటి ట్యాంకు శిథిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లును కూల్చివేసి ఆక్రమణకు గురికాకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉపరితల ఘని ఏర్పాటు ప్రాంతాలను కలెక్టర్ మ్యాపులో పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ స్వర్ణలత, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, జియం నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల తహసిల్దార్లు క్రిష్ణప్రసాద్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post