వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తొర్రూరు,
మహబూబాబాద్, జూన్ -06:

వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంభందిత అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొర్రూరు మండలం లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సోమవారం వెజ్ మార్కెట్ ను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వెజ్ మార్కెట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మార్కెట్ లో టాయ్లెట్ లు నిర్మించాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వెజ్ మార్కెట్ ఏర్పాట్లపై మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వార్డు కౌన్సిలర్ తూనం రోజా తో మాట్లాడారు. వెజ్ మార్కెట్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాం చంద్రయ్య, కౌన్సిలర్ తూనం రోజా, మునిసిపల్ కమిషనర్ గుండె బాబు, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, ఆర్డీవో రమేష్, డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, పి.హెచ్.ఈ.ఈ., మునిసిపల్ ఈ. ఈ. రంజిత్, మిషన్ భగీరథ డి. ఈ. వెంకటేశ్వర రెడ్డి, ఏ. ఈ. శ్రీనివాస్, తహసిల్దార్ రాఘవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post