వెదజల్లే పద్దతిలో వరిసాగు లాభదాయకం

జిల్లాలో ఈ వానాకాలంలో  వెదజల్లే పద్దతిన  మూడు వేల ఎకరాలలో వరి సాగు చేయన్నామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఎకరాకు 8 నుండి 10 వేల రూపాయల పెట్టుబడి తగ్గడంతో పాటు,  నాటు  వేయుటకు కూలీల కొరత అధిగమించవచ్చని, ఒక్కరే ఆరు ఎకరాల వరకు వడ్లు వెదజల్ల వచ్చని,  నీరు  తక్కువ అవసరమవుతాయని, దిగుబడి కూడా ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ వరకు వస్తుందని అన్నారు. బుధవారం మెదక్  మండలం బాలానగర్ క్లస్టర్ లో సూరిబాబు అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో 16 ఎకరాలలో వారి సాగుకై మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి తో కలిసి వడ్లు వెదజల్లారు. ఈ రైతు గత యాసంగిలో కూడా వెదజల్లే పద్దతిన సాగుచేయడాన్ని అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ ఏదైనా కొత్త పద్దతిలో సాగు చేయాడానికి చిన్న రైతులు జంకు తారని , పెద్ద రైతులే ముందుకు వచ్చి  వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి  కొత్త కొత్త ప్రయోగాల ద్వారా సన్న,చిన్న కారు రైతులలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపాలని అన్నారు.    వ్యవసాయ విస్తరనాదికారులు రైతులతో మమేకమై వారితో పాటు ప్రత్యామ్నాయమైన  కంది, పత్తి వంటి వాణిజ్య పంటలవైపు రైతులు మొగ్గు చూపేలా చూడాలని,, వాటికి మార్కెట్ సౌకర్యం ఉందని  అవగాహన కలిగించాలని అన్నారు. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు, వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు అందించాలని అన్నారు.

మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతు మెదక్ జిల్లా పంట పొలాలతో కళ కళ  లాడుతూ సుభిక్షంగా ఉండాలని అన్నారు.  రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. గుర్తించి 24 గంటల ఉచిత  విద్యుత్, సాగు నీరు,  ఎరువులు,విత్తనాల సరఫరా, పెట్టుబడి సాయం,రైతు భీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతులు పండించిన పంటన గిట్టు బాటు ధరకు కొనుగోలు చేస్తున్నదని, వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరనాదికారిని ఏర్పాటు చేసి వ్య్వసయారంగంలో వస్తున్న మార్పులు, ఆధునాత వ్యవసాయ పద్ధతులపై రైతులలో చైతన్యం కలిగిస్తున్నారని, వారు సమిష్టిగా ఐక్యమై చర్చించుకోవడానికి రైత్ వేదికలను నిర్మించారని అన్నారు. తాతల కాలం నాటి పూర్వ విధానంలో  వెదజల్లే పద్దతిని మనమీనాడు అవలంబిస్తున్నామని అన్నారు. వ్యవసాయంలో మెళకువలు నేర్చుకోవాలని, పంట మార్పిడి విధానం ప్రోత్సహించాలని, మన జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉన్నందున మార్కెటింగ్ కు చాల అవకాశాలున్నాయని, ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం పై దృష్టి సారించాలని అన్నారు. వ్యవసాయాధికారులు రైతులతో మమేకమై పనిచేస్తూ వారిలో నమ్మకం కలిగించాలని అన్నారు.

అనంతరం శాసనసభ్యురాలు నాగయ్య అనే రైతు వ్యవసాయ పంట క్షేత్రంలో దిగి కూలీల ఆట పాటల  మధ్య   వరినాట్లు వేసారు.

అంతకుముందు కలెక్టర్ హరీష్, శానసభ్యురాలు పద్మ గ్రామంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి,  జిల్లా వ్యవసాయాధికారి పరశురం నాయక్, వ్యవసాయాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post