వెల్టూరు, మనిగిళ్ళ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ : జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా

పత్రిక ప్రకటన తేది:5 అక్టోబర్,2021,, వనపర్తి

గత 5 సం.ల నుండి పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్బంగా చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా తెలిపారు.
మంగళవారం పెద్దమందడి మండలం వెల్టూరు, మనిగిళ్ళ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన పేద మహిళలకు బతుకమ్మ చీరలను శనివారం నుండి ప్రజా ప్రతినిధులతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. అర్హులైన పేద మహిళలు ఉన్నారని, వారికి చౌక ధరల దుకాణాల ద్వారా చీరల పంపిణీ చేయడం జరుగుచున్నదని, ఇప్పటి వరకు మండలానికి 10 వేల 300 బతుకమ్మ చీరలు రావడం జరిగిందని ఆమె తెలిపారు. బతుకమ్మ పండుగ వేళ చీరలు పంపిణీ చేస్తున్నందున పేద మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వెల్టూరు గ్రామ పంచాయతీలో 885 బతుకమ్మ అందినట్లు ఆమె తెలిపారు. పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వెల్టూర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (P.H.C) నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, త్వరలో శంకుస్థాపన నిర్వహించుటకు సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం హార్టికల్చర్ కళాశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు.
అనంతరం మనిగిళ్ళ గ్రామ పంచాయతీలో 890 బతుకమ్మ చీరలు అందినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ దసరా పండుగకు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగనున్నాయని, కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం పింఛన్లు, ఇతర పథకాలు అమలు చేసిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, ఎంపీపీ మేఘా రెడ్డి, జడ్పిటిసి రఘుపతి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, డి.ఈ. ప్రమోద్ రావు, ఎంపీటీసీ. అంజనమ్మ ఎం. డి.ఓ.ఆఫ్జల్, డిప్యూటీ ఎమ్మార్వో తిలక్ రెడ్డి, మండల అధ్యక్షులు రాజ్య ప్రకాష్ రెడ్డి, మనిగిల్ల సర్పంచ్ సరిత, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తుల జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
……….

జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయనైనది.

Share This Post