వేములవాడలో బతుకమ్మ సంబురాలు…. పాల్గొన్న గవర్నర్

వేములవాడలో బతుకమ్మ సంబురాలు….
పాల్గొన్న గవర్నర్

వేములవాడలో మూలవాగు బతుకమ్మ ఘాట్ వద్ద శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ గవర్నర్ కు స్వాగతం పలికారు.
గంగమ్మ ను దర్శించుకుని బతుకమ్మ ను బతుకమ్మ తెప్ప లో వదిలారు.

ఆ వెంటనే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ , వేములవాడ ప్రజలకు ఆరోగ్య , ఐశ్వర్యాలను ప్రసాదించాలని అన్నారు.

అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే స్వాగతం పలికారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

వేములవాడ లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, పురపాలక సంఘం సభ్యులు , అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Share This Post