*వేములవాడ ఏరియా హాస్పిటల్ లో రెండవ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స* – *ట్విట్టర్ వేదికగా అభినందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*

*వేములవాడ ఏరియా హాస్పిటల్ లో రెండవ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స*   – *ట్విట్టర్ వేదికగా అభినందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*

Pl scroll and publish

*వేములవాడ ఏరియా హాస్పిటల్ లో రెండవ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స*

– *ట్విట్టర్ వేదికగా అభినందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*

——————————
సిరిసిల్ల 29, మే 2022:
——————————
వేములవాడ ఏరియా హాస్పిటల్ లో రెండవ మోకాలి మార్పిడి (Total Knee Replacement) శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను
ట్విట్టర్ వేదికగా అభినందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఆదివారం ప్రశంసించారు.

కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న వేములవాడ ఏరియా హాస్పిటల్ భవనం ను ఈ మధ్యే రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రారంభించారు.

అన్ని సదుపాయాల తో కూడిన నూతన ఆసుపత్రి భవనం అందుబాటులోకి రావడంతో ఆసుపత్రి వైద్యులు ద్విగుణీకృత ఉత్సాహం తో పని చేస్తూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇటీవలే నూతన ఆసుపత్రి లో వైద్యులు
మోకాలి మార్పిడి (Total Knee Replacement) శస్త్ర చికిత్స ను విజయవంతంగా నిర్వహించారు.

ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ లోనే ఇది మొట్ట మొదటి మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స కావడంతో వైద్యుల పై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

అదే ఉత్సాహం తో తాజా గా రెండో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆ విషయాన్ని ఆసుపత్రి అధికారి క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పోస్ట్ చేశారు.

కాగా పోస్ట్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు స్పందించారు.

మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స వియవంతం చేసిన వేములవాడ ఏరియా ఆస్పత్రి
వైద్యులు ,వైద్య సిబ్బంది బృందానికి అభినందనలు….
రానున్న రోజుల్లో అలాంటి మరెన్నో విజయ గాథల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post