వేములవాడ డిపోకు ప్రగతి చక్రం అవార్డ్

వేములవాడ డిపోకు ప్రగతి చక్రం అవార్డ్

వేములవాడ డిపోకు ప్రగతి చక్రం అవార్డ్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతులమీదుగా అవార్డు అందుకున్న డిఎం భూపతిరెడ్డి

వేములవాడ ఆర్టీసీ డిపో 2020 -21 సంవత్సరంలో అన్ని రంగాల్లో లాభాల బాటలో తీసుకెళ్లినందుకు గాను ప్రగతి చక్రం అవార్డును కైవసం చేసుకుంది.

గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రగతి చక్రం అవార్డును అప్పటి వేములవాడ డిపో మేనేజర్, ప్రస్తుత కరీంనగర్ 1 డిపో మేనేజర్ భూపతిరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నీ ప్యారా మీటర్లలో ముందంజలో ఉండడంతో రాష్ట్రం మొత్తం మీద మూడు అవార్డులు వచ్చాయని, వీటిలో వేములవాడ డిపోకు అవార్డు రావడం అభినందనీయమన్నారు. డిపో లోని ప్రతీ ఉద్యోగి కృషివల్లనే ఈ అవార్డు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

Share This Post