వేములవాడ ప్రాంతీయ దవాఖాన ఎకో ఫ్రెండ్లీ అవార్డుకు రాష్ట్రంలో 86.19% మార్క్స్ తో మొదటి దవాఖాన గా నిలిచింది.

 

వేములవాడ ప్రాంతీయ దవాఖాన ఎకో ఫ్రెండ్లీ అవార్డుకు రాష్ట్రంలో 86.19% మార్క్స్ తో మొదటి దవాఖాన గా నిలిచింది.

*అలాగే కాయకల్ప అవార్డుకు రాష్ట్రంలో 84.29% మార్క్స్ తో మూడవ స్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో దాదాపుగా100 ప్రాంతీయ దవాఖానలు ఉండగా మూడు అంచల విధానంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, వ్యర్ధాల సేకరణ, విద్యుత్ వినియోగం, పచ్చదనానికి, ప్లాస్టిక్ రహిత ప్రాధాన్యత ఇలా దాదాపుగా 10 విభాగాల్లో పరిశీలించి మార్కులు ఇస్తారు. వంద మార్కులకు గాను వేములవాడ ప్రాంతీయ దవఖాన 86.19 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఎకో ఫ్రెండ్లీ అవార్డుకు మొదటి స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన ప్రాంతీయ దవఖానకి ప్రభుత్వం 5.00 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ఈ నగదు బహుమతి ఆస్పత్రి అభివృద్ధి నిమిత్తం వాడుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ మహేష్ రావు మాట్లాడుతూ
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే రమేష్ బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతిల ప్రోత్సాహంతో ఈ అవార్డును సాధించగలిగాం. డాక్టర్లు మరియు సిబ్బంది అందించిన సహకారం కూడా వెన్నంటి ఉంది.

Share This Post