వేసవిక్రీడా శిబిరాలు ఉపయోగించుకోండి- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

వేసవిక్రీడా శిబిరాలు ఉపయోగించుకోండి- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

గత రెండు సంవత్సరాలుగా కరోనాతో క్రీడలకు దూరమైన విద్యార్థులకు మే 1 నుండి 21 వరకు నెలరోజుల పాటు జిల్లాలోని 11 కేంద్రాలలో నిర్వహించే క్రీడా శిబిరాలు ఎంతో ఉపయుక్తమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శిక్షకులు కూడా విద్యార్థులకు క్రీడల పట్ల ఉత్తమ శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని కోరారు. శుక్రవారం తన ఛాంబర్ లో మరో అదనపు కలెక్టర్ తో కలిసి 11 కేంద్రాల శిక్షణా నిర్వాహకులకు క్రీడా పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిమ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ శిక్షణ శిబిరాలు గొప్ప అవకాశమని, సద్వినియోగం చేసుకొని క్రీడా రంగంలో రాణించాలని అభిలషించారు.
అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుందని అన్నారు. క్రీడా పరికరాలను సద్వినియోగం చేసుకొని వేసవి శిక్షణ శిభిరాలను విజయవంతం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలలో కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ , వ్యాయామ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post