ప్రచురణార్థం
మహబూబాబాద్ మార్చి 28.
మండువేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతల పట్ల తీసుకుని చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పిస్తూ త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి అయినా ఆశాలతో ఉపాధి హామీ కూలీల ఆరోగ్యాన్ని పరీక్షింప చేయాలన్నారు.
రైతులు తమ పంట చేలల్లో చెత్తను తగలబెట్టకుండా ఈ వ్యవసాయ అధికారులు అవగాహన పరచాలన్నారు హరితహారం లో మొక్కలు కాలిపోతే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు.
మున్సిపాలిటీలలో గ్రామపంచాయతీలలో బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో మార్కెట్స్లలో తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు అధికారులు గానీ ఉద్యోగులు గాని వేసవిలో క్షేత్రస్థాయిలో పర్యటించరాదని సూచిస్తూ ఉదయమే వెళ్లాలన్నారు పశువులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు పారిశుద్ధ్య కార్మికులు కూడా మండుటెండలో పని చేయించరాదని పని వేళలు మార్పు చేయాలని అధికారులకు సూచించారు డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని 60 సంవత్సరముల దాటిన వారికి త్వరితగతిన వైద్యం అందించి పంపాలన్నారు వసతి గృహాలలో వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఆరుబయట తిరగనీయరాదన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులు వేసవిలో కాలువలను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
వేసవిలో ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లా ఫైర్ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని ఫోన్ కాల్స్ కు స్పందించాలన్నారు.
త్రాగునీటి కొరత రానీయరాదని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జెడ్పి సీఈవో రమాదేవి పిడి డిఆర్డిఏ సన్యాసయ్య ఆర్డీవోలు కొమరయ్య రమేష్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు