ప్రచురణార్థం
మహబూబాబాద్ మార్చి 29 .
వేసవిని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీలలో ప్రజలకు సరిపోను స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడిఓసిలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి సరఫరాను దృష్టిలో ఉంచుకొని ప్రాణాలికబద్ధంగా మున్సిపాలిటీ లలో గృహాలకు సరఫరా చేయాలన్నారు మండు వేసవిలో త్రాగునీటి కొరత రానివ్వరాదని అధికారులను ఆదేశించారు అందుకు ముందస్తు నివేదిక ఇవ్వాలని ప్రాణాలకు రూపొందించుకోవాలన్నారు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలన్నారు
వాటర్ ట్యాంకులను శుభ్రం చేయిస్తూ రిజిస్టర్లో నమోదు చేసి ప్రజాప్రతినిధులకు తెలపాలన్నారు
పదివేల లీటర్ల నీళ్లకు 50 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపి క్లోరినేషన్ చేసుకోవాలని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.
నీటి సరఫరాలో లీకేజీలు లేకుండా ముందుగానే సరిచేసుకోవాలని నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు.
అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలు చేసే ఫిర్యాదుకు మిషన్ భగీరథ అధికారులు మున్సిపాలిటీల అధికారులు సమిష్టిగా పర్యవేక్షించి నీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు .
ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి నీటిని వృధా చేయకుండా ప్రజలకు అవగాహన పరచాలన్నారు
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ డి ఈ ఉపేందర్ ఏఈలు మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు