వేసవిలో పశువుల సంరక్షణ కొసం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువులు, గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు : జిల్లా కలెక్టర్ నిఖిల

వేసవిలో పశువుల సంరక్షణ కొసం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువులు, గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక  శాఖ ముద్రించిన వేసవిలో పశువుల సంరక్షణ అనే గోడ పత్రిక, కరపత్రాలను జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,

పశువులు, గొర్రెలు, మేకలను వేసవిలో వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే మేతకు బయటకు తీసుకోవేళ్ళని, ఎండ తీవ్రత ఉన్నపుడు షెడ్లలో మాత్రమే ఉంచాలన్నారు.  షెడ్ ల చుట్టు ప్రక్కల నీడనిచ్చే చెట్లు ఉండేటట్లు చూసుకోవాలన్నారు.  పశువులకు అవసరమైన నీరు అందుబాటులో ఉంచాలని, వీలైనంత వరకు పశువులకు పచ్చి మేత అందించాలిన్నారు.  వాడదెబ్బకు గురైన పశువులను వెంటనే పశు వైద్య అధికారిని సంప్రదించలన్నారు.  మారుతున్న వాతావరణానికి అనుగుణంగా వాటిని శాస్త్రీయ యాజమాన్య పద్దతిలో పెంచడం వలన పశువుల ఉత్పదక శక్తి తగ్గకుండ రైతులు ఆశించిన ఫలితాలను పొందవచ్చన్నరు. వేసవిలో పశువుల సంరక్షణపై అధికారులు రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య శాఖ అధికారి అనిల్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి దుర్గాప్రసాద్, LDM రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post