వేసవిలో వరికి ప్రత్యాన్మయ పంటల సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకు సూచించారు.

శుక్రవారం సుజాతనగర్ మండలం పాత అంజనాపురం గ్రామంలోని రైతు వేదికలో వేసవిలో వరి కి బదులుగా ఇతర పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో   ఏర్పాటు చేసిన ఇతర పంటల సాగు అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యపు నిల్వలు పెరిగి పోవడంతో పాటు పారా బాయిల్ బియ్యాన్ని కూడా కొనలేమని భారత ఆహార సంస్థ ఖరా ఖండిగా తేల్చి చేర్పినందున రైతులు వరికి బదులుగా ఇతర పంటల సాగు చేపట్టాలని చెప్పారు. పంటల మార్పిడి సాగు వల్ల భూ సాంద్రత పెరుగుతుందని చెప్పారు. యాసంగిలో వేసే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలను  లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన అనంతరం తప్పనిసరిగా బిల్లులు తీసుకుని భద్రపరచాలని చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాంటి  వివరాలు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క గోప్యత పాటించడం జరుగుతుందని చెప్పారు. యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని  సూచించారు . మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు . భూమి రకం , వాతావరణ పరిస్తితులను బట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచినలతో వారు సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగును చేపట్టాలని చెప్పారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు  వానాకాలం ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో  పని చేస్తున్నాయని చెప్పారు.  ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ధాన్యం మిల్లులకు చేరేంత వరకు జరిగే ప్రక్రియలో  ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని  రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు పంపాలని  కేంద్ర నిర్వహకులకు  సూచించారు.యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికల్లో  పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో  ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమస్యలు ఉన్న , సమస్యలు ఎదురయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించి …. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయలన్నారు.అనంతరం పాపారావు అనే రైతు పాలి హౌస్ వ్యవసాయ విధానం ద్వారా చేపట్టిన టమాటా సాగును పరిశీలించారు. దిగుబడి గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. ఇతర రైతులు ఇటువంటి వ్యవసాయ పద్ధతులు  చేపట్టు విదంగా అవగాహన కల్పించాలని, రైతులకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, పిఏసీఎస్ చైర్మన్ వీర హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post