వేసవి కాలంలో చేపట్టావల్సిన ముందస్తు చర్యలపై అధికారులు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ యస్ వెంకట్రావ్ అన్నారు

వేసవి కాలంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలునందు జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి ఎండ తీవ్రతలపై తీసుకొనె చర్యలను సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు చర్యలపై సమావేశం నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని ప్రముఖ హోటల్లు, అపార్ట్మెంట్లలు, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, సినిమా హాల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ,అగ్నిమాపక అధికారులకు ఆదేశించారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు రెవెన్యూ డివిజన్ , మండలాలో, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించ డానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు పనులు నిర్వహించే వద్ద షెడ్ నేట్స్ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి వసతిని ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు పని వేళలను మార్చాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప తగు జాగ్రత్తలతో బయటకు రావాలని కలెక్టర్ అన్నారు. జన సమూహాలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్, పంచాయతీ సెక్రెటరీలకు కలెక్టర్ ఆదేశించారు. ఎండాకాలంలో కూలీలు, కార్మికులు నిర్వహించే పని వేళలను మార్చుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలలో మూగజీవాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నర్సరీ లలో కూడా మొక్కలకు షేడ్ నెట్ ఏర్పాటు చేయాలని, తగు వాటరింగ్ చేయాలని అన్నారు .ఎవెన్యూ ప్లాంటేషన్లలో చిన్న మొక్కల స్థానంలో పెద్ద మొక్కలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండాకాలంలో త్రాగునీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా చూడాలని, మిషన్ భగీరథ వాటర్ సరఫరా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, ఆర్డీవోలు వెంకారెడ్డి, రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, డీఎఫ్ఓ సతీష్ కుమార్, జడ్పీ సీఈఓ సురేష్, డిపిఓ యాదయ్య, డి ఆర్ డి ఓ పి డి కిరణ్ కుమార్, జిల్లా అగ్గిమాపక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


Share This Post