వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి….

వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి….

మహబూబాబాద్, ఏప్రిల్ -27:

గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో వేసవి క్రీడా శిక్షణా శిభిరాల ఏర్పాటు, నిర్వహణ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, మే మొదటి వారంలో ప్రారంభించే విధంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఉదయం, సాయంత్రం అనుకూల సమయంలో క్రీడలు నిర్వహించే విధంగా చూడాలని, మునిసిపల్ వారీగా శిబిరాలు ఏర్పాటు చేసేందుకు, క్రీడలలో శిక్షణ కల్పించుటకు శిక్షకులు అందుబాటులో ఉన్నార లేదా గుర్తించి అందుబాటులో ఉన్న శిక్షకుల ననుసారం ఏర్పాట్లు చేయాలని, ప్రజాప్రతినిధుల సహకారంతో క్యాంపులు ప్రారంభ, నిర్వహణ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల లో ఏర్పాటుతో పాటు, గిరిజన ప్రాంతాలలో ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పోటీల నిర్వహణకు అనువైన ఆట స్థలాలు, నెట్, మ్యాట్ ల లభ్యత, అయ్యే ఖర్చు, ఏ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు చేస్తే అత్యధికంగా పిల్లలు వస్తారు, ఏ ఏ క్రీడల ను నిర్వహించాలి అనే విషయాలపై పూర్తి వివరాలను రెండు రోజులలో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ. ఓ. రమాదేవి, డి.అర్.డి. ఓ. సన్యాసయ్య, DYSO బి.అనిల్ కుమార్, మునిసిపల్ కమిషనర్ లు, సిబ్బంది, పి.ఈ.టి. అసోసియేషన్ అధ్యక్షురాలు టి. పుష్పాలత, తదితరులు పాల్గొన్నారు.

————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే. జారీ చేయనైనది.

Share This Post