వైకల్యం అనేది శరీరంలో ఒక అవయవానికి సంబంధించినదే తప్ప మనసుకు సంబంధించినది కాదు: స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత

ప్రచురణార్థం ములుగు జిల్లా
3.12.2021 ,( శుక్రవారం)

వైకల్యం అనేది శరీరంలో ఒక అవయవానికి
సంబంధించినదే తప్ప మనసుకు సంబంధించినది కాదని దివ్యాంగులను సమాజంలో ఆదరించి ప్రభుత్వ పథకాలను అందించి చేయూతనివ్వాలని
బాలలు వయో వృద్ధులు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి నీ ప్రేమలత తెలిపారు
శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా సంక్షేమ శాఖ మహిళలు వయో వృద్ధులు మరియు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు పొందవచ్చు అని అన్నారు.
ఈ సదస్సులో జిల్లాలోని యూనియన్ నాయకులు అదేవిధంగా దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు సభ్యులు పాల్గొని ములుగు జిల్లా లోని దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అనంతరం అర్హులైన వివిధ లబ్ధిదారులకు దివ్యాంగుల వాహనాలు మరియు స్వయం ఉపాధికి సంబంధించిన రుణాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉద్యోగులు సిబ్బంది Brb స్వాతి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగులు పాల్గొన్నారు.

Share This Post