Revised పత్రికా ప్రకటన నల్గొండ, నవంబర్ 16 .జిల్లాలో మిగిలి ఉన్న వైకుంఠ దామం లు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం
సమావేశ మందిరం లో ,పంచాయతీ రాజ్ డి.ఈ. లు,ఏ.ఈ. లు, ఎంపీడీఓలతో సమావెశము నిర్వహించి డివిజన్ల వారిగా వెనుకబడిన మండలాలు,జి.పి లలో వైకుంఠ దామం ల నిర్మాణం ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది దశలో ఉన్నవి,స్లాబ్ దశలో ఉన్నవి ఈ నెల 24 లోగా పూర్తి చేయాలని, మిగిలిన వివిధ దశలలో ప్రగతి లో ఉన్న వైకుంఠ దామం లను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ ప్రగతి ఆన్ లైన్లో పొందు పర్చాలనితెలిపారు.జిల్లాలో754 వైకుంఠ దామం లు నిర్మాణం మంజూరు కాగా ఇప్పటి వరకు 681 వైకుంఠ దామం లు నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.పూర్తి చేసిన వాటిలో 607 ఆన్లైన్ చేసినట్లు,పూర్తి చేసిన వాటిని వెంటనే ఆన్ లైన్ లో పొందు పరచాలని ఆదేశించారు.నల్గొండ పి.ఆర్.డివిజన్ లో 285 వైకుంఠ దామం లు మంజూరు కాగా 270 పూర్తి చేసి 241 ఆన్ లైన్ లో పొందు పర్చినట్లు,మిర్యాల గూడ పి.ఆర్.డివిజన్ లో 469 మంజూరు కాగా 411 పూర్తి చేసి 366 ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు వెల్లడించారు. అన్ని జి పి.లలో నూరు శాతం నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు.వైకుంఠ దామంలు నిర్మాణం కు గాను నల్గొండ డివిజన్ కు 36 కోట్ల రూ.లు మంజూరు చేయగా 32 కోట్లు వ్యయం చేసినట్లు,మిర్యాల గూడ డివిజన్ లో 59 కోట్ల రూ.లు మంజూరు కాగా 50 కోట్ల రూ.లు వ్యయం చేసినట్లు తెలిపారు. పనులు పూర్తి చేసిన వాటికి బిల్లులు సమర్పించి ఎఫ్ టి. ఓ జనరేట్ చేసి చెల్లింపులు చేయాలని అన్నారు. ఎం.పి.డి.ఓ.లు ఏజెన్సీ లతో సమన్వయం చేసుకొని త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశం లో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జడ్పీ సి.ఈ.ఓ వీర బ్రహ్మా చారి,డి.పి.ఓ.విష్ణు వర్ధన్ పంచాయితీరాజ్ ఈ ఈ తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.