వైకుంఠ దామాలను నాణ్యత తో చేపట్టాలి… జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్ధం

వైకుంఠ దామాలను నాణ్యత తో చేపట్టాలి…

మహబూబాబాద్, జూలై 7:

జిల్లాలో నిర్మిస్తున్న వైకుంఠదామాలను నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి పంచాయతీ రాజ్శాఖ నిర్మిస్తున్న వైకుంఠ దామాల ప్రగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 380 వైకుంఠదామాలు నిర్మించగా. 377 పూర్తి అయ్యాయని, ఆర్చి, కలరింగ్, బయో ఫెన్సింగ్ వంటి పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు.

నీటి సౌకర్యం, మరుగుదొడ్లు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలన్నారు. జూలై 10వ తేదీ లోపు పూర్తిచేసేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో బయో ఫెన్సింగ్ పనులు చేపట్టాలని మొక్కలు నాటాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పంచాయతీరాజ్ ఈ ఈ సురేష్ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ డిఇలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post