వైకుంఠ దామాల నిర్మాణపు పనులు పదిహేను రోజులలో పూర్తి చేయాలన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్.

వైకుంఠ దామాల నిర్మాణపు పనులు పదిహేను రోజులలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ
సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

బుధవారం మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపైన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా వైకుంఠ ధామాల పనులు పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో
కాలేదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు 15 రోజులలో పనులు పూర్తి చేయాలని లేనిచో అట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

మండలాల వారీగా పల్లె ప్రగతి పనులను యంపిడిఒ లను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాలలో పారిశుద్ధ్య పనుల పై శానిటేషన్ స్కోర్ తక్కువగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ ను దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాలలో పంచాయతీ సిబ్బంది తమ విదులపట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని…ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు… పంచాయతీ సెక్రటరీలను నియమించారని అందరూ సమయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పరచాలని సెక్రెటరీ పేర్కొన్నారు.

శానిటేషన్ స్కోర్ తక్కువగా ఉన్న గ్రామాలలో సిబ్బందికి dpo తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు.

మండలాలలోని రోడ్లకు ఇరుపక్కల అవెన్యూ ప్లాంటేషన్ వివరాలను డిఆర్డిఏ పిడి సంపత్ రావును అడిగి తెలుసుకున్నారు.

మహిళా సంఘాల వివరాలు వారి బ్యాంకు లింకేజీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో కొన్నిచోట్ల ఆలస్యంగా జరుగుతున్నదని దీనికిగాను ఏ పీ ఎం, డి పి ఎం లు తమ పరిధిలోని మహిళా సంఘాల
రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సెక్రెటరీ ఆదేశించారు.

సంఘాలు కొత్తగా ఆదాయం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టి వారు ఆర్థికంగా నిలబడే విధంగా అధికారులు తగు చర్యలు చేపట్టాలని సెక్రెటరీ తెలిపారు.

మహిళా సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే విధంగా సూచన చేయాలన్నారు.

మహిళా సంఘాలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలి అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలన్నారు.

వాక్సినేషన్ వేయించుకున్న వారు కూడా తప్పక మాస్కు ధరించాలని సెక్రెటరీ సూచించారు.

వరంగల్ జిల్లాలో పల్లె ప్రకృతి వనాల ఏ వెన్యూ ప్లాంటేషన్ చాలా బాగున్నాయి అని… వైకుంఠ గ్రామాలు మరియు రైతులు తమ పొలాల వద్ద కల్లాల
నిర్మాణం చేపట్టలేదని అధికారులు లు చర్యలు తీసుకొని త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని సెక్రెటరీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఎం హరిత మాట్లాడుతూ సెక్రెటరీ సూచించిన విధంగా పురోగతిలో లేని పనుల త్వరగా
పూర్తయ్యేలా చూస్తానని… రైతులు తమ పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు చేసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తామన్నారు.

ప్లాంటేషన్ మరియు మహిళాల సంఘాల రుణాలను త్వరగా చెల్లించేలా అధికారులకు తగు సూచనలు చేస్తానని… అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో లో అదనపు కలెక్టర్ హరి సింగ్ ,డి ఆర్ డి ఓ సంపత్ రావు, జడ్పీ సీఈఓ రాజారావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అన్ని మండలాల ఎంపీడీవోలు,ఎపిఒలు, డి పి వో లు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post