వైకుంఠ ధామాలకు నీటి సౌకర్యం తప్పనిసరి…

వైకుంఠ ధామాలకు నీటి సౌకర్యం తప్పనిసరి…

ప్రచురణార్థం

వైకుంఠ ధామాలకు నీటి సౌకర్యం తప్పనిసరి…

మహబూబాబాద్, జనవరి,4.

వైకుంఠ దామాలకు నీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులతో రైతు వేదికలలో సౌకర్యాలు, వైకుంఠ ధామాలలో సౌకర్యాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు,
రహదారుల నిర్మాణాలు, బ్రిడ్జ్ ల నిర్మాణాలపై సమగ్రంగా సమీక్షించారు.

ముందుగా రైతు వేదికల సౌకర్యాలపై సమీక్షిస్తూ…అన్ని సౌకర్యాల తో పూర్తి చేయాలన్నారు.

వైకుంఠ దామాలకు తప్పనిసరిగా నీటి సౌకర్యం కల్పించాలన్నారు.

గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు.

అదే విధంగా రహదారులను, బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రహదారుల నిర్మాణంలో సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.

భూ సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

కందికొండ దేవాలయానికి మెట్ల నిర్మాణాలకు అవసరమైన చోట మాత్రమే రెయిలింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశం లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి సురేష్, డి.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post