వైకుంఠ రథాల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన విర్చో పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లాలోని పారిశ్రామిక యాజమాన్యాలు సమాజసేవలో ముందుండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి , ఆగస్ట్ 3:–

వైకుంఠ రథాల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన విర్చో పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్

జిల్లాలోని పారిశ్రామిక యాజమాన్యాలు సమాజసేవలో ముందుండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు.

మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీర్చో పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం జిల్లాకు వైకుంఠ రథాల కోసం సీఎస్ఆర్ నిధుల కింద రూ.25 లక్షలు విరాళంగా చెక్కు రూపేనా జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కంపెనీ డైరెక్టర్ కె. వంశీధర్ రెడ్డి ని అభినందించి, శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సి పి ఓ మనోహర్ పాల్గొన్నారు.

Share This Post