వైద్యాధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్ధం

మే, 31 ఖమ్మం:

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెలలో 69 శాతం సాధారణ ప్రసవాలు చేసి, రాష్ట్ర సగటు 40 శాతం కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినందుకు వైద్యాధికారులను మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ అభినందించారు. ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, సిబ్బంది కృషిని అభినందిస్తూ కలెక్టర్ కేక్ ను కట్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గత ఏప్రిల్ నెలలో 263 సాధారణ ప్రసవాలు (61%), ఈ నెలలో 284 సాధారణ ప్రసవాలు (69%) జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. పటిష్ట కార్యాచరణ, వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. 3వ, 4వ ఏవన్సీ చెకప్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, ప్రతి గర్భిణిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. హై రిస్క్ కేసులపై దృష్టి పెట్టి, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. 24 గంటలు స్త్రీ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారన్నారు. ఇంకనూ సాధారణ ప్రసవాల ప్రయోజనాలపై గర్భిణులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ, ఇంకనూ మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. ‘

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిణి డా. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, గైనకాలజి డాక్టర్లు మంగళ తేజ, భారవి, ఆస్మ, వివిధ ప్రాజెక్టు అధికారులు డా. సైదులు, డా. కృప ఉషశ్రీ, డా. సులోచన, వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post