వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ప్రచురునార్ధం

వరంగల్

02-04-2022

వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారు. ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ది.

దేశంలో అరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానం చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయి. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలి. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలి.

ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దేశంలోనే టి డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నాము. 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. దీనిపై దృష్టి పెట్టాలి.

అరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందేలా చూడాలి. ఎక్కువ కేసులు చేయడం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందటంతో పాటు ఆసుపత్రులు బలోపేతం అవుతాయి.

108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, అలనా వాహనాలు రివ్యూ చేయాలి. ఆసుపత్రుల్లో జిల్లా కలెక్టర్లు సర్ ప్రైస్ విజిట్ చేయాలి. అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలి.

పి హెచ్ సి ల్లో వైద్యులు లేరు అనే మాట ఉండొద్దు. ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని చెప్పారు. ప్రతి పి హెచ్ సి లో డాక్టర్ ఉండాలి. వాక్ ఇంటర్వ్యూ లో పెట్టీ అపాయింట్ చేయాలి.

102 వాహనాలను ఎఫెక్టివ్ గా వాడాలి. గర్భిణులకు సేవలు అందించాలి. ఏ ఎన్ ఎం చేకప్స్ చేయించాలి.

ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలి. తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలి.

అనవసరంగా చేయడం వల్ల తల్లి, బిడ్డకు నష్టం. తల్లి, పిల్ల ఆరోగ్యం బాగుండాలంటే సి సెక్షన్లు తగ్గాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గేలా చర్యలు తీసుకోవాలి.

ఏఎన్సి చెకప్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాతా శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుంది.

కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలి. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలి.

ఎన్ సి డి స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలి. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి. టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నాము. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు గాను తెలంగాణకు కేంద్రం నుండి అవార్డు వచ్చింది. ఈ విషయంలో కేటగిరీ 2 నుండి 1 కి వచ్చాము.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలి.

ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, డైట్ సేవలను సమీక్షించాలి.

బడ్జెట్ లో చార్జీలను పెంచడం జరిగింది. పాత టెండర్ల గడువు పూర్తి అయిపోయింది. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.

636 పీహెచ్ సి 232 అర్బన్ పి హెచ్ సి లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుంది.

రాష్ట్రంలో 18 ఏళ్లు పై బడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలి.

కొత్త మెడికల్ కాలేజీల పనులు, ఆసుపత్రి అప్ గ్రేడేషన్ పనులు వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈసారి మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలని చెప్పారు. ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదనలు త్వరగా పంపాలి.

వడ గాలుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి.

ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలి.

సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యం పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలన్నారు

ఈవీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కొరకు సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు

అన్ని పనులకు సంబంధించి అడ్మిషన్ సాంక్షన్ ఈ నెల 10 వరకు పూర్తి చేస్తామని చెప్పారు

ఇప్పటి వరకు 92 పాఠశాలలకు అడ్మిషన్ శాంక్షన్ పూర్తి చేయడం జరిగిందని.. పెండింగ్ లో గల 82 పాఠశాలకు రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు

పాఠశాలలో షేడ్స్ ,ఆర్ సి సి రూఫింగ్ ,డైనింగ్ హాల్ సంబంధిత విషయాల్లో మంత్రివర్యులు సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తామన్నారు

ఈ వీసీ లో అదనపు కలెక్టర్ లు, dmho, deo, మండల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు

Share This Post